సాయి సద్గురూ!
త్వదీయ పాద దర్శనం సదా సుబుద్ధి ప్రేరకం
మదీయ మానసం, త్వదీయ మార్గ చాలితం, సువ
ర్ణ దివ్య శోభితాంగ! సుందరాంగ! షిర్డి పాలకా!
ప్రదీప్త రమ్య భూషితాంగ! పాహి! సాయి సద్గురూ! || ౧ ||
అనాథ నాథ సాయినాథ! సర్వ పాప నాశకా!
అనంత విశ్వమెల్ల నీ కృపా కటాక్ష రక్షితం
జనార్ధనా! యటంచు గొల్తు ఆర్తి తోడ బ్రోవుమా!
పినాకపాణివయ్య నీవు పాహి! సాయి సద్గురూ!
అకాల మృత్యు నాశకా! విశాల లోక రక్షకా!
సకాల వర్ష దాయకా! విశారదా! యటంచు ని
న్ను కీర్తి సేయ నెంచగా, వినూత్నమైన శాంతి కాం
తి కంటినయ్య! భవ్య సూర్య తేజ! సాయి సద్గురూ!
స్తుతింతు సాయి నామమే! ప్రదోషమెల్ల బాయునే,
అతీంద్ర శక్తి వోలె మాకు అండ నిల్చినావు సా
యి, తాపసంబు బాపుమంతు వేడెదన్ మనంబునన్
న్నుతించెదన్ సదా సమర్థ నాథ! సాయి సద్గురూ!
స్వరాల మాల తోడ సంస్తుతింప నెంచితిన్
వరాల వాన, మేఘమల్లె అంద జేయుమా ప్రభో!
శరాల వంటి బాధలన్ని శాంతి జేసి బ్రోవుమా!
సరోజ మాల తోడ పూజ సేతు సాయి సద్గురూ! || 5 ||
వినూత్న శోభ
తోడ వెల్గు వేదవాత్మరూపకా!
అనంత దివ్య
భవ్య భాసితాంగ! రమ్య శోభితా!
వినమ్రతల్
ఒసంగినావు, ఇందు శేఖరప్రియా!
మనస్సు
నందునిండె నయ్య హాయి సాయి సద్గురూ!
సువర్ణ వర్ణ పుష్ప మాల సుందరంబు నీకు, దు
గ్ధ వర్ణ వస్త్ర శోభ తోడ కాంచినాడ నీ దినం
సువైద్య! ఊది తోడ మాకు సౌఖ్యమంద జేస్తివే!
అవాజ్యమైన ఆర్తి నింపినావు సాయి
సద్గురూ!
జయంబు నీకు దేవ దేవ! జాడ చూప రావయా!
జయంబు నీకు సాయి నాథ! సేరి నన్ను కావుమా!
సయోధ్య, శాంతి నింపి నాదు సంకటంబు తీర్చుమా!
ప్రయాస లన్ని దీర్చినావు పాహి! సాయి సద్గురూ!
సహాయ హస్తమంద జేయు శాంత మూర్తి నీవయా!
ఇహంబు నందు మోక్షమిచ్చు నీదు ద్రుక్కు చాలయా!
అహంబు వీడునయ్య నీదు అండ ఉండగా! ప్రభూ!
మహేశుడయ్యి నిల్చినావు మాకు సాయి సద్గురూ!
ప్రజాపతీ! యటంచు నీదు
పాద సేవ చేసినన్
సుజాత పద్మమల్లె నేడు శోభలిల్లె నామనం
బు, జాడ చూపి, తోడు నిల్చు భూవిభుండవయ్య, నా
దు జన్మ ధన్యమాయె, శాంతి దూత! సాయి సద్గురూ! || 10 ||
సుమంబులన్ని దెచ్చి నీదు సేవ చేసినంతటన్
సమస్యలన్ని దీరునయ్య సాయి! దీనభాంధవా!
ప్రమోదమందె మానసంబు పాద దర్శనంబుతో
అమూల్య రత్న శోభితాత్మ! మాన్య! సాయి సద్గురూ!
అభీష్ఠ సిద్ధి కారకా! సుహార్ద్ర భావ శోభితా!
సుభాషితంబు నీదు వాక్కు, సేరి నన్ను కావుమ
య్య! భాగ్యమంద జేయు మయ్య! ఈప్సితార్థ దాయకా!
అభూత భావమెల్ల వీడెనయ్య! సాయి సద్గురూ!
సుభాషితంబు నీదు వాక్కు,శోత్రియం, మధూ ప్రియం
ప్రభాత రేఖ నీదు ద్రుక్కు, పాప నాశకం హరా!
విభో! యటంచు పిల్చి, నిన్ను వేడితిన్ మనోస్థితా!
అభాగ్యులైన మమ్ము కావుమయ్య, సాయి సద్గురూ!
అనేక లాభ దాయకంబు సాయి పాద సేవనం
అనంత విశ్వమేది సాటి? సాయి పాద ధూళికిన్
వినూత్న తేజమొందె సాయి వెల్చినdºà
మానసం
అనాథనాథ! సాయి నాథ! పాహి! సాయి సద్గురూ!
అనంత లోక రక్షకా! అవాజ్య ప్రీతి దాయకా!
సనాతనా! జనార్ధనా! విశారదా! యటంచు ని
న్ను నమ్మితిన్ ప్రభూ! వినూత్న నూత్నభావనామృతం
బు నాదు మానసాన నిండె, భవ్య సాయి సద్గురూ! || 15 ||
మదీయ మానసాన నిల్చి మార్గదర్శివైతివే,
త్వదీయ ద్రుక్కు చాలునయ్య! వాంఛితంబు దీరునే,
వదాన్యుడైన నన్ను కావుమయ్య షిర్డి సాయి నా
థ! దేవ దేవ! నీవె నాకు అండ, సాయి సద్గురూ!
సుధామయంబు నీవు పల్కు సూక్తి, షిర్డి పాలకా!
విధాత రీతి కావుమయ్య వేద రూప! సాయి నా
థ! ధీశ! సంకటంబు తీర్చు అండ నీవు! సర్వ శ
క్తి ధాత్రి యందు, బ్రోవుమయ్య తండ్రి! సాయి సద్గురూ!
అమంగళంబులన్ని బాపు ఆప్త రక్షకా! విభో!
సుమాల మాల తోడ నీకు శోభ తేవనెంచితిన్
సుమంబు సంతసించె నిన్ను సేరినంతటన్ ప్రభో!
అమోఘమైన వెల్గు నీడె ధాత్రి, సాయి సద్గురూ!
లలాటమందు చందనంబు, లాస్య రేఖ వెల్గు మో
ము, లీలలన్ని చూపు ఊది, మోక్షమిచ్చు శాంతి దూ
త! లోభమెల్ల బాపి, ఈప్సితార్థమందజేయు దా
త! లోకమంత శాంతి నింపు తండ్రి! సాయి సద్గురూ!
ప్రశాంత భావమందజేయు పండరీవిలాస రూ
ప, శంకలన్ని దూరమాయె పాదపూజ సల్పగా
సుశీలవంతుడైతి నీదు సేవ చేసినంతటన్
విశాల నేత్ర! గొల్తునెల్ల వేళ! సాయి సద్గురూ! || 20 ||
యశస్సు నింపు సాయి రూపు అండ నాకు ఉండగా
అశాంతి బాసి, శాంతి నిండె మానసాన, నాదు ఎ
ల్ల శోకమీడె, బాధలన్ని అంతమొందె, పాహిమాం!
సుశోభితాంగ! నీవె నాకు ఒజ్జ! సాయి సద్గురూ!
అభీష్ట దాయకుండు సాయి మానసాన నిండగా
అభీష్టమంత దీ±µÀ¶mAd, ధన్యుడైతి నేడిలన్
విభూతి తోడ రోగ పీడ వీడె నేడు, ధాత్రి యం
దు భాగ్యమెల్ల నిండె పాహి దేవ! సాయి సద్గురూ!
అహంబు వీడి నిన్ను చేరె భక్త కోటి ఈ దినం
ఇహంబు నందు రక్ష నిల్చి ఏలు షిర్డి పాలకా!
సహాయమందజేసి మమ్ము అండ నిల్చి బ్రోవుమా!
మహేశుడైన నీవె అండ మాకు, సాయి సద్గురూ!
నమోస్తు సత్య రూప! సాయి నాథ! దేవ దేవ! నా
కు మోక్షగామి నీవెనయ్య, కోటి సూర్య తేజసా!
నమస్సులందజేనినన్, మనస్సు శాంతమొందిలన్
తమస్సు వీడు ఎల్ల జీవితంబు! సాయి సద్గురూ!
నవీన మార్గ దర్శకా! అనంత భాగ్య దాయకా!
అవాంతరమ్ములన్ని బాపు అండ షిర్డి నాథుడే!
సువైద్య రీతి శుద్ధి చేయు శోత్రియా! హరాత్మజా!
భువీంద్ర! అందుకోవుమయ్య పూజ, సాయి సద్గురూ! || 25 ||
No comments:
Post a Comment